కింగ్ విరాట్ కోహ్లీలా ఉండడానికి ఆయన స్టైల్‌ను చాలా మంది ఫాలో అవుతుంటారు. కానీ చంఢీగఢ్‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మాత్రం అచ్చం విరాట్‌లానే ఉన్నాడు. అతన్ని చూసిన ఎవరైనా విరాట్ కు ట్విన్ బ్రదర్ అనకుంటారు. ప్రస్తుతం అతని లుక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Karthik Sharma, a software engineer in Chandigarh, Virat Kohli's doppelganger is going viral on the internet.
Kohli Doppelganger: చంఢీగఢ్(Chandigarh)కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ని పోలి ఉన్నందుకు ప్రస్తుతం వైరల్‌గా మారాడు. క్రికెట్ అభిమాని అయిన కార్తీక్ శర్మ తన జీవితంలో ఒక్కసారైన విరాట్‌ను కలుసుకోవాలనేది అతని లక్ష్యం అంటున్నాడు. చాలా సందర్భాల్లో అతని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఒకసారి అతని ఇన్స్టాగ్రామ్ పేజీని పరిశీలిస్తే, అతని జుట్టు, గడ్డం, అలాగే అతని ముఖ కవలికలు, ఆకరికి తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా కింగ్ కోహ్లీని పోలీ ఉంటుంది.
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తిక్ శర్మ మాట్లాడుతూ…నన్ను చూసిన విరాట్ అనుకుంటున్నారా…నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను ఎక్కడికి వెళ్లినా ఫోటోల కోసం ప్రజలు చుట్టుముడుతారని.. అలాగే తనకు క్రికెట్ అంటే ఇష్టమని విరాట్ కోహ్లీని తాను ఆరాధ్యదైవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏదో ఒక రోజు తాను విరాట్ కలిసి, తన కల నెరవేర్చుకుంటానని పేర్కొన్నాడు. ఇక తనను చూసిన చాలా మంది విరాట్ కవల సోదరుడని అంటారని తెలిపాడు. ఇక తన ఇన్‌గ్రామ్‌లో వచ్చే చాలా కామెంట్లలో తాను విరాట్‌లా ఉన్నావని చెప్తుంటారు.
ప్రస్తుతం ఇతనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. ఇక విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌లోనే తన ఒక మైలు రాయిని చేరుకున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును దాటేశాడు. ICC పరిమిత-ఓవర్ టోర్నమెంట్లలో (ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ) భారత క్రికెట్ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు గతంలో 58 మ్యాచ్‌ల్లో 2,718 పరుగులు చేసిన దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. కింగ్ కోహ్లీ 64 మ్యాచ్‌లలో 2,785 పరుగులు సాధించి దాన్ని అధిగమించారు.