పచ్చగా ఉన్న టీడీపీ సర్వనాశనం కావడానికి ముఖ్య కారణం నారా లోకేష్ అని అంబటి ఆరోపించారు. తండ్రీకొడుకులు ఇద్దరు తప్పు చేశారని అందుకే బాబు ఊసలు లెక్కబెడుతున్నారని పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
TDP party has been destroyed because of Lokesh.. Ambati Rambabu
Ambati Rambabu: స్కిల్ డెవలప్మెంట్(skill development) కేసులో అవినీతి చేశాడు కాబట్టే సీఐడీ నోటీసులు ఇచ్చి చంద్రబాబును సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ఇక టీడీపీ సర్వనాశనం కావడానికి ముఖ్య కారణం నారా లేకేశ్(Nara Lakesh) అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలువకున్నా కూాడా నామినేటెడ్ పదవితో క్యాబినేట్లోకి వచ్చి దోపిడి చేస్తే ప్రభుత్వం ఊరుకోదు కదా అని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో కూడా మంచి వాళ్లు ఉన్నారని, పచ్చగా ఉన్న మీ పార్టీకి లోకేష్ వచ్చిన తరువాతే ఈ గతి పట్టిందన్నారు. జగన్‌కు భయాన్ని పరిచయం చేస్తా అన్న లోకేష్ గతి ఏం అయిందో మీరే చూస్తున్నారని.. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇలానే జరుగుతుందని పేర్కొన్నారు.
చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. మీ తండ్రి వైఎస్సారే ఏమీ చేయలేకపోయారు. నీవేం చేస్తావంటూ సీఎం జగన్ ను అన్నారని.. కట్ చేస్తే బాబును జైల్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. ఇక తండ్రి అరెస్ట్ అయితే భార్యబిడ్డలను వదిలేసి పారిపోయాడని లోకేష్‌ను విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అయితే గుండెపోటుతో అభిమానులు చనిపోయారని ఒకటి, రెండు పత్రికలు రాశాయని, వారిని పరామర్శించాల్సింది పోయి లోకేష్ ఢిల్లీకి ఎందుకు పోయాడని ప్రశ్నించారు.
అప్పుడప్పుడు బాలకృష్ణ కామెడీ చేస్తుంటారని ఈ మధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కామెడీ చేస్తున్నారని తెలిపారు. ఆయన టీడీపీకి మద్దతు ఇస్తానని అంటున్నాడు. తరువాత టీడీపీ పని అయిపోయిందని అతనే అంటున్నాడని, అయినా పవన్‌కు ఏం బలం ఉందని టీడీపీకి మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ఈ సారి ఏపీలో వైఎస్ఆర్సీపీ మొత్తం 175 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అంబటి ధీమా వ్యక్తం చేశారు.