Sister : సమాజంలో మంచి, మానవత్వం ఉండటం లేదు. బంధాలు కూడా కనిపించడం లేదు. డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు ప్రేమ అనే మొహంలో మునిగి పోతున్నారు. తమకు అడ్డుగా ఉన్నవారిని తొలగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ అక్క తన సొంత చెల్లెళ్లను చంపి.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. నిజమే, ఆమె ప్రియుడితో రాసలీలల్లో మునిగి తేలుతుంది. పాపం.. ఆ చిన్నారులకేం తెలుసు.. సరాసరి ఇంట్లోకి వచ్చేశారు. వారిని చూసి డిస్టర్బ్ అయి ఉంటుంది. అమ్మ, నాన్నకు చెప్పొద్దు అని చెబితే బాగుండేది.. అంతా జ్ఞానం ఉంటే బాగుండు.. ఎక్కడ తమ బండారం బయటపడుతుందని ఆందోళన చెందింది. చిన్న పిల్లలను అని కూడా చూడకుండా రాక్షసత్వాన్ని బయట పెట్టుకుంది.
శృంగారం చేస్తూ బిజీ
ఉత్తరప్రదేశ్ బహదూర్పురిలో ఈ దారుణ ఘటన జరిగింది. జయ్‌వీర్ దంపతులకు ఏడుగురు సంతానం. దంపతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పని చేసేందుకు వెళుతుంటారు. వీరి నలుగురు కుమారులు కూడా హత్య జరిగిన సమయంలో లేరు. అంజలి అనే పెద్ద కూతురు తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. కబుర్లు చెప్పుకుంటూ వారిద్దరూ రాసలీలల్లో మునిగి పోయారు. ఇంట్లో చెల్లెళ్లు, తమ్ముళ్లు ఉన్నారనే సోయి కూడా లేదు. తమ పనిని కానిచ్చేశారు.
సడెన్‌గా వచ్చిన చెల్లెళ్లు
అలా వారు శృంగార క్రీడలో మునిగి ఉండగా.. సడెన్‌గా ఇద్దరు చెల్లెళ్లు వచ్చారు. రోషిణి (7), సురభి (5) రాగా.. వారిని చూసి అంజలి అసహ్యించుకుంది. తమ ఏకాంతాన్ని పాడు చేశారని కోపం తెచ్చుకుంది. కొన్ని క్షణాల తర్వాత తమ సంగతి అమ్మ నాన్నలకు చెబుతారని భయపడ్డారు. ఇంకేముంది.. ప్రియుడితో కలిసి డిస్కషన్ చేసింది. వారిని హతమార్చాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంటిలో ఉన్న కోడవలి వంటి ఆయుధంతో తలపై వేటు వేసింది. చిన్న పిల్లలు అని చూడలేదు. జాలి, దయ, కరుణ చూపలేదు. మృగంలా దాడి చేసి.. మట్టుబెట్టింది.
హత్య చేసి.. ఆపై
ఇద్దరిని చంపిన తర్వాత ఏం చేయాలి.? ఎలా తప్పించుకోవాలని ఆలోచించుకుంది. ఆయుధానికి ఉన్న రక్తం కడిగేసింది. తనతోపాటు ప్రియుడికి అయిన రక్తపు మరకలను తుడిచేసింది. మెల్లిగా తనకేమీ తెలియనట్టు బయటకు వచ్చింది. పొలం పనులకు వెళ్లి వచ్చిన తల్లికి కట్టుకథ చెప్పింది అంజలి. ఇంటికి ఎవరో వచ్చారని.. చెల్లెళ్లను హత్య చేశారని వివరించింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేశారు. అంజలి డ్రెస్‌పై పోలీసులు రక్తం చూశారు. అనుమానం వచ్చి ఇదేంటని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించింది. కూతురే చెల్లెళ్లను చంపిందని తెలిసి ఆ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
అంజలి అరెస్ట్
పోలీసులు అంజలిని అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడు పరారీలో ఉన్నారు. అతనిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. తన సుఖం కోసం.. ఇంట్లోకి వచ్చిన అభం శుభం చిన్నారులను దారుణంగా హతమార్చింది అంజలి. ఆమెకు కఠిన శిక్ష విధించాలని చుట్టుపక్కల వారు కోరుతున్నారు. దీంతో మరొకరు ఇలా తెగించేందుకు వెనకడుగు వేయాలని అంటున్నారు. ఎన్ని కఠిన చట్టాలు వస్తోన్న.. సరైన శిక్ష పడటం లేదు. క్రైమ్ జరిగేందుకు సోషల్ మీడియా కూడా ఓ కారణం అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.