తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు బతుకమ్మ. భాద్రపదం మాసం ప్రారంభంతో పండగ అంబరాన్ని అంటుతోంది. అప్పుడే సింగపూర్లో ఉండే తెలుగు ప్రజలు పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
Bathukamma 2023: ఆశ్వయుజ మాసం ప్రారంభం అమవాస్య నుంచి బతుకమ్మ (Bathukamma 2023) వేడుకలను 9రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. వివిధ నైవేధ్యాలతో గౌరమ్మను పూజించుకుంటారు. రకరకాల పువ్వులను ఉపయోగించి భక్తితో బతుకమ్మను (Bathukamma 2023) తయారు చేస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో మొదలైన ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో పూర్తవుతాయి. బతుకమ్మ వేడుకలను సింగపూర్లో జరుపుకోనున్నారు. తెలుగు సమాజం అధ్యర్యంలో వేడుకలు జరగనున్నాయని అధ్యక్షులు బొమ్మా శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ నెల అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక టాంపనిస్ సెంట్రల్ పార్క్ దగ్గర బతుకమ్మ పండుగను జరుపుకోనున్నారని ఆయన తెలిపారు. ఆడపడుచులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి స్వాతి కోరారు. వేడుకల్లో ప్రఖ్యాత గాయని వరమ్ పాటలు పడనున్నారు. మొదటి 3 ఆకర్షణీయమైన బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు ఉన్నాయి. లక్కీ విజేతకు 5గ్రాముల బంగారం బహుమతిగా ఇవ్వనున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.