ఇజ్రాయెల్(Israel)పై మెరుపు దాడి చేసి ఆ దేశంలో చొరబడ్డ హమాస్ తీవ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఇజ్రాయెల్‌పై సైన్యం వారిని వెంటాడి చంపుతొంది.గ్రామాల్లో హమాస్ మిలిటెంట్లు (Hamas militants) వందల మంది పౌరులను హతమార్చారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ టెర్రరిస్టు(Terrorist)లను కనిపించిన చోటే కాల్చిపడేస్తున్నారు. ఈ క్రమంలో గాజా బార్డర్ లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు పోలీసుల దృష్టిలో పడ్డారు. ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు (Police) ఛేజ్ చేశారు. ఓ కారులో ఇద్దరు పోలీసులతో పాటు బైక్ పై మరో ఆఫీసర్ వారిని వెంటాడారు. మిలిటెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనే కసితో హైవేపై దూసుకెళ్లారు.
ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ ఒక చేత్తో బైక్ నడుపుతూనే మరో చేతితో మిలిటెంట్ల (Militants)పై కాల్పులు జరిపారు.పలు రౌండ్లు కాల్పులు జరపగా.. కారు నడుపుతున్న మిలిటెంట్ కు బుల్లెట్ తగిలినట్లు కనిపించింది. ఆ తర్వాత కాసేపటికే మిలిటెంట్లు ఉన్న కారు రోడ్డు పక్కన ఆగింది. అయినా పోలీసులు కాల్పులు (Firing) ఆపలేదు. బైక్ తో వెంటాడిన పోలీస్ ఆఫీసర్ తో పాటు కారులో వచ్చిన మరో ఇద్దరు పోలీసులు పలు రౌండ్లు కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు. ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియో(Video)ను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Police and Border Police officers heroically neutralized two armed terrorists outside of Netivot on Saturday. We will continue working on the front lines to defend our civilians from terror pic.twitter.com/PQk9KiiKoT