తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) సతీమణి శోభ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆమె తోమాల సుప్రభాత సేవ, అనంతరం శ్రీవారి (Srivari) అర్చనలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. తన భర్త ఆరోగ్యం కోసం స్వామిని మొక్కుకుని, తలనీలాలను సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ (Viral fever) తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి హెల్త్ బులెటిన్ (Health Bullet) విడుదల కాకపోవడంతో పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శోభ(Shoba) కు అర్చకులు, టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమెను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి (Chevireddy) భాస్కర్ రెడ్డి పక్కనే ఉండి ఆమె కు స్వామివారి దర్శనం చేయించారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు.