»Shocking 1000 Birds Died After Hitting The Building In One Day
Chicago: షాకింగ్..ఒకే రోజు భవనాన్ని ఢీకొని 1000 పక్షులు మృతి
పక్షులు వేల సంఖ్యలో మరణించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ కుప్పలు కుప్పలుగా చనిపోయి ఉన్న పక్షులను చూసి ప్రజలు ఆందోళన చెందారు. ఆ పక్షులన్నీ ఓ భవనాన్ని ఢీకొని చనిపోయినట్లుగా తేలింది.
ఒకే రోజు ఓ భవనాన్ని ఢీకొని 1000 పక్షులు మృతిచెందారు. ఈ దారుణ ఘటన అమెరికాలోని చికాగోలో చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో పక్షులు చనిపోయి ఉండటం చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పక్షులన్నీ శీతాకాలంలో వలస కోసం వెళ్లి తిరిగొస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా పక్షులన్నీ కూడా వలస కోసం దక్షిణ అమెరికాకు వెళ్లి వస్తుంటాయి. చికాగోలోని మెక్కార్మిక్ ప్రాంతంలో రెండున్నర కిలోమీటర్ల వరకూ ఈ పక్షులు మృతిచెంది కుప్పలు కుప్పలుగా పడిపోవడంతో కలకలం రేపింది.
చనిపోయిన పక్షుల్లో కొన్నింటిని స్థానికులు ఆస్పత్రులకు తీసుకెళ్లి టెస్ట్ చేయించారు. ఓ భవనాన్ని ఢీకొని కింద పడిపోవడం వల్లే ఆ పక్షులన్నీ చనిపోయినట్లుగా చికాగో బర్డ్ కొలిజన్ మానిటర్స్ డైరెక్టర్ అన్నెట్ ప్రిన్స్ తెలిపారు. ఆ పక్షుల్లో కొన్ని చనిపోగా మరికొన్ని గాయాలపాలయ్యాయి. ఏటా శీతాకాలంలో దాదాపు 15 లక్షల పక్షులు వలస వెళ్తూ ఉండగా అందులో టేనస్సీ వార్బెర్స్, హెర్మిట్ థ్రష్, అమెరికన్ వుడ్కాక్స్, మరికొన్ని జాతి పక్షులు ఉన్నాయి.
పెద్ద పెద్ద భవనాల్లోని కిటికీకి తగిలి ప్రతి పక్షీ చనిపోదని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియోలో బ్రెండన్ శామ్యూల్స్ అనే సైంటిస్ట్ వెల్లడించారు. పక్షుల మరణాలకు గాలి, వర్షం, పొగమంచు వంటివి కారణాలని ఆయన అంచనా వేశారు. ప్రతి ఏటా బిలియన్ పక్షులు గాజు కిటికీలను ఢీకొని చనిపోతున్నట్లు అమెరికన్ బర్డ్ కన్జర్వెన్సీకి చెందిన బ్రియాన్ లెంజ్ అనే శాస్త్రవేత్త తెలిపారు.
చాలా పక్షులు భవనానికి ఉన్న అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు భయపడి కింద పడి చనిపోతున్నాయని, అలా కింద పడ్డ కొన్ని పక్షులు గాయపడుతున్నాయన్నారు. అయితే భవనాల్లోని లైట్లు ఆఫ్ చేసి ఉంచడం వల్ల పక్షుల మరణాలను తగ్గించవచ్చని, అలా చేయడం వల్ల పక్షుల మరణాలను 6 నుంచి 11 రెట్లు తగ్గిందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.