»2023 Nobel Prize In Economic Sciences Awarded To Claudia Goldin
Economicsలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ ప్రైజ్.. ఏం చేశారంటే.?
అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌ను నోబెల్ పురస్కారం వరించింది. ఆమె కంటే ముందు ఇద్దరు ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు.
2023 Nobel prize in Economic Sciences awarded to Claudia Goldin
Claudia Goldin: అర్థశాస్త్రంలో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌కు (Claudia Goldin) నోబెల్ పురస్కారం లభించింది. లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిథ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనం చేశారు. ఆ అంశంపై గోల్డిన్‌ను అవార్డుకు ఎంపిక చేశామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న మూడో మహిళగా గోల్డిన్ నిలిచారు. అమెరికాలో పురుషులు, స్త్రీల మధ్య వేతన వ్యత్యాసాలను వివరించే అంశాలకు సంబంధించి పరిశోధన చేశారు. లేబర్ మార్కెట్లో మహిళల పాత్ర గురించి అర్థం చేసుకోవడం సమాజానికి ముఖ్యం అని నోబెల్ ఎకనామిక్ సైన్స్ కమిటీ చైర్మన్ జాకబ్ స్విన్సన్ తెలిపారు. సంచలనాత్మక పరిశోధన చేసినందుకు గోల్డిన్‌కు ధన్యవాదాలను తెలియజేశారు.
గోల్డిన్ 1946లో న్యూయార్క్‌లో జన్మించారు. ప్రస్తుతం హర్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గత 200 ఏళ్ల నుంచి స్త్రీ, పురుషుల మధ్య డేటాను పరిశీలించి పరిశోధన చేశారు. విద్య, వృతి ఎంపిక ద్వారా వేతనాల్లో తేడా ఉందని గుర్తించారు. ఓకే ఉద్యోగం చేస్తునప్పటికీ స్త్రీ, పురుషులు తీసుకునే జీతంలో మార్పు ఉందని గ్రహించారు. మహిళకు తొలి సంతానం జన్మించడంతో సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడంతో వృత్తిపరంగా వీక్ అవుతారని పరిశోధనాత్మకంగా ఫ్రూవ్ చేశారు. పురుషులకు అలాంటి సమస్య ఉండదని.. అందుకే కెరీర్లో మహిళల కన్నా త్వరగా ఎదుగుతున్నారని.. ఎక్కువ జీతం తీసుకుంటున్నారని వివరించారు.