»This Years Nobel Prize In Physics Goes To Ri Agostini Ferenc Crouse And Lhuillier
Nobel Prize: భౌతికశాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతి
ఈ సంవత్సరం అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలు చేసిన ముగ్గరికి ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు దక్కింది
This year's Nobel Prize in Physics goes to Ri Agostini, Ferenc Crouse and L'Huillier.
Nobel Prize: సైన్స్ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం అయిన నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన ఈ ఏడాది ప్రారంభం అయింది. అందులో భాగంగా భౌతిక శాస్త్రం (Physics)లో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురికి లభించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని(Perry Agostini), జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్(Ferenc Crouse), స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్(Anne L. Huillier)కు ఈ ఏడాది నోబెల్ ప్రకటించారు.
అణువుల్లో (Atoms) ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకు.. కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే పరిశోధనలకు గానూ వీరికి ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్ (Electrons)ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని తెలిపింది. సోమవారం మొదలైన ఈ ప్రకటలో నిన్న మెడికల్ విభాగంలో ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. కొవిడ్ మహమ్మారిపై పోరు కోసం సమర్థ ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి మార్గం సుగమం చేసిన శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌లను ఈ అవార్డు వరించింది. అలాగే బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.