»The Announcement Of Candidates Is Delayed As Part Of The Election Strategy Kishan Reddy
BJP: అభ్యర్థుల ప్రకటన ఆలస్యం ఎందుకంటే..? కిషన్ రెడ్డి
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. క్యాండెట్స్ అనౌన్స్మెంట్ లేట్ ఎందుకు అయ్యిందో వివరించారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
BJP: తెలంగాణ(Telangana)లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగు రైలు సర్వీసుల పొడిగింపు కార్యక్రమలో పాల్గొన్నారు. జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. అభ్యర్థుల ప్రకటన తమ ఇష్టమని, నామినేషన్ చివరి వరకు ఎప్పుడైన ప్రకటించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదని వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం వరకు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు వివరించారు.
ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే రెండు సార్లు తెలంగాణకు వచ్చారు. కేంద్ర మంత్రులు, పార్టీ నాయకులు త్వరలో ప్రచారానికి వస్తారని. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైల్వేల కోసం కేంద్రం ₹33వేల కోట్లు ఖర్చు చేస్తుందని, హైదరాబాద్‌కు కొత్త రైల్వే టెర్మినల్ వస్తోంది. జనవరిలో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను జాతికి అంకితం చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్‌లో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. రెండో ఫేజ్‌లో కొత్త మార్గాలను వేగంగా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని ఆయన పేర్కొన్నారు.