»Election Commission Announced Telangana And Other State Schedule
Telanganaలో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్
తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.
Election Commission Announced Telangana and Other State Schedule
Telangana: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరంలో కూడా ఎన్నిక జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 230, రాజస్థాన్లో 200, ఛత్తీస్ గఢ్లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 679 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈసీ రాజీవ్ కుమార్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్లో 5.25 కోట్లు, మధ్యప్రదేశ్లో 5.6 కోట్లు, ఛత్తీస్ గఢ్లో 2.03 కోట్లు, మిజోరంలో 8.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.
మిజోరంలో నవంబర్ 7వ తేదీన పోలింగ్ జరగనుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నేపథ్యంలో ఛత్తీస్ గఢ్లో రెండ విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 7వ తేదీన తొలి విడత.. నవంబర్ 17వ తేదీన రెండో విడత జరగనుంది. మధ్యప్రదేశ్లో నవంబర్ 17వ తేదీన, రాజస్థాన్లో నవంబర్ 23వ తేదీన.. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓకే విడత పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీన ఓకేసారి జరగనుంది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ డిసెంబర్ 5వ తేదీతో ముగుస్తోందని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3వ తేదీన విడుదల చేస్తారు. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 10 వరకు అవకాశం ఇచ్చారు. నామినేషన్లను నవంబర్ 13వ తేదీ వరకు పరిశీలిస్తారు. నామినేషన్ల విత్ డ్రా చేసుకునేందుకు నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.