ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు.. ఆ తర్వాత రాజమౌళితో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అలాగే బోయపాటితో కూడా ఓ సినిమా ఫిక్స్ అయ్యాడట మహేష్. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు బోయపాటి.
Boyapati: గుంటూరు కారం జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత రాజమౌళి సినిమా స్టార్ట్ చేయనున్నాడు మహేష్ బాబు. మరి ఆ తర్వాత సూపర్ స్టార్ లిస్ట్‌లో ఉన్న డైరెక్టర్ ఎవరంటే.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అనే చెప్పాలి. రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో.. మహేష్ బాబుతో ఓ కమర్షియల్ సినిమా చేయాలని, మహేష్ ఏదైనా చెయ్యగలడని.. మాస్, క్లాస్, ఫ్యామిలీ.. అది ఇది అని లేదు.. మహేష్ ఒక ఆల్ రౌండర్ అని చెప్పుకొచ్చాడు బోయపాటి. అలాగే.. గతంలోనే మహేష్‌కి ఓ కథ చెప్పాను.. ఓకె అనుకున్నాం.. కానీ మహేష్ చేస్తున్న చిత్రం పూర్తి అయ్యేలోపు.. నేను వేరే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. అలా ఇద్దరికీ కుదరలేదు. కానీ మహేష్ బాబుతో తప్పకుండా సినిమా చేస్తానని.. చెప్పాడు.
ఈ క్రేజీ కాంబో నిజంగనే సెట్ అయితే.. బోయపాటి, మహేష్‌ను ఎలా ప్రజెంట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. బోయపాటి, బాలయ్యను తప్ప మిగతా స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడంలో తడబడ్డాడు. ఎన్టీఆర్ ‘దమ్ము’, రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’తో రొడ్డ కొట్టుటు కొట్టాడు. లేటెస్ట్ ఫిల్మ్ ‘స్కంద’తో లాజిక్ లెస్‌గా రామ్‌తో విలన్లనను నరికించాడు. అలాంటి బోయపాటి, మహేష్ బాబును ఎలా చూపిస్తాడు? లాజిక్ లేకుండా విలన్లను గాల్లో లేపితే మహేష్ ఒప్పుకోడు. పైగా ఈ సినిమా హై మీటర్లో ఉంటుందా?అని ముందే అడిగాడట మహేష్. అలాంటిదేం లేదు బాబు.. నేను చూసుకుంటానని చెప్పాడట బోయపాటి. కాబట్టి.. ఈ క్రేజీ కాంబో కుదిరితే ఎలా ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు. మహేష్ నుంచి ఒక కమర్షియల్ మాస్ సినిమా పడితే చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి.. బోయపాటి, మహేష్ ప్రాజెక్ట్ సెట్ అయితే ఊరా మాస్‌గా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కాకపోతే మహేష్ కటౌట్‌కి తగ్గట్టుగా సాలిడ్ మాస్ కంటెంట్ పడాలి. లేదంటే.. ఇక అంతే సంగతులు!