బాలయ్య నటించిన లేటెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరో వైపు అన్‌స్టాపబుల్ టాక్ షో కూడా రెడీ అవుతోంది. తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ లిమిటేడ్ ఎడిషన్ ప్రోమో కూడా రిలీజ్ అయింది.
Limited Edition: వచ్చే దసరాకు ‘భగవంత్ కేసరి’గా రాబోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఖచ్చితంగా ఈ సినిమా బాలయ్య ఫాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెబుతున్నాడు. కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేసింది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అందుకు తగ్గట్టే ఉంది. ఇక భగవంత్ కేసరి సినిమాతో పాటు.. మరోసారి అన్స్టాపుల్తో దుమ్ములేపడానికి వస్తున్నాడు బాలయ్య.
ఆహా ఓటిటిని టాప్ ప్లేస్‌కు తీసుకెళ్లని క్రెడిట్ అంతా బాలయ్యదే. అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. స్టార్ హీరోలతో, పొలిటికల్ లీడర్స్‌తో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. చివరగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌తో సీజన్ 2 ఎండ్ చేశారు ఆహా. కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు సీజన్ 3కి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే థర్డ్ సీజన్ కోసం బాలయ్య ఆహాకు సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. దసరా రోజు ఫస్ట్ ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆహా వారు ఒక ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. గతంలో అన్‌స్టాపబుల్ మొదటి రెండు సీజన్లకు సంబంధించిన షూటింగ్ విజువల్స్‌తో.. బాలయ్య పవర్ ఫుల్ డైలాగులతో ప్రోమో కట్ చేశారు. త్వరలోనే ఈ అన్‌స్టాపబుల్ లిమిటేడ్ ఎడిషన్ ప్రారంభం కాబోతోంది అంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈసారి అన్‌స్టాపబుల్ గెస్ట్‌లు ఎవరొస్తారో చూడాలి.