నటి భూమి పెడ్నేకర్ తన సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను వెల్లడించింది. పాత్రల కోసం చేసిన శారీరక మార్పులు తన ఆరోగ్యంపై ప్రభావం చూపాయని, ‘ది లేడీ కిల్లర్’ వైఫల్యం తనను బాగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. స్క్రిప్ట్‌లో మార్పులు, అసంపూర్తిగా సినిమా విడుదల కావడం తనను ఆశ్చర్యపరిచాయని, ఇదొక పెద్ద పాఠం నేర్పిందని ఆమె పేర్కొంది.