TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు ఈస్ట్ హరిజనవాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లిపూడి బాలకృష్ణ (35) మనస్తాపానికి గురై స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.