ప్రకాశం: హనుమంతుడుపాడు మండలం పరిధిలోని వేములపాడు రోడ్డులో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా శనివారం ఎస్సై మాధవరావు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలను గుర్తించి ఈ-చలాన్లు విధించారు. ఈ తనిఖీల ద్వారా వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.