KDP: గండి క్షేత్రం అర్చకులపై మాజీ ఛైర్మన్ రాజారావు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బుల కోసం నైవేద్యం పెట్టకుండా అపచారం చేస్తున్నారని, క్షేత్రంలో అవినీతి తాండవం ఆడుతోందని విమర్శించారు. పూలమాలలు తిరిగి విక్రయించడం, తాయతులు అమ్మకం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అర్చకుల ఆస్తులపై విచారణ జరిపించాలని, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.