రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్దులకు అప్పాయింట్మెంట్ లెటర్లను ప్రధాని మోదీ వీడియో కాన్షరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లు ,లోకో పైలట్లు, టెక్నీషియన్లు, ఇన్స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లు,కానిస్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్మెంట్ ఈ పథకం ద్వారా చేస్తారు. అందుకు సంబంధించినకు నియామక పత్రాలను పంపిణీ చేసి ప్రధాని రోజ్ గార్ మేళాను ప్రారంభించారు.
రోజ్గార్ మేళాతో ఉపాధి కల్పన, యువతకు సాధికారత లభిస్తుందని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఉపాధి మేళా ద్వారా యువత సాధికారత సాధిస్తూనే, దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యానికి భరోసా కల్పిస్తోంది. స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, టీచర్, నర్సు, డాక్టర్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ స్టాఫ్ లకు నియామక పత్రాలను ప్రధాని అందజేశారు.