రాష్ట్రాన్ని నడిపే ఐఏఎస్ అధికారులకు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ శాలరీలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన అన్నారు. వారికి 20వ తేదీ వచ్చిన జీతాలు (Salaries) ఇవ్వటం లేదని వారికి వేతనలు ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగ ఉల్లంఘన వైసీపీ నేతలకు సహజ గుణంగా మారింది. అసమర్థ ప్రభుత్వ పాలనతో సమస్యలు లేవనెత్తితే దాడులు చేస్తున్నారు.సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు.
కేసులు వాయిదా వేయించుకోవడానికి సీఎం జగన్ (CMJAGAN), ఎంపీలు దిల్లీకి వెళ్తున్నారా? అరాచకాలకు చరమాంకం పలకాల్సిన అవసరం ఉంది.’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కొల్లేరు నీటి సమస్య చాలా బాధ కలిగించిందని పవన్ తెలిపారు. కైకలూరు, ఉండవల్లి, ముదినేపల్లిలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొల్లేరు సరస్సు(Kolleru Lake)లో 17వేల టన్నుల వ్యర్థాలు చేరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంటూరు పరిస్థితిమారుతోందని, కొల్లేరు సరస్సుకు సంబంధించి చాలా ఆక్రమణలు ఉన్నాయని పవన్ తెలిపారు.కేసుల మాఫీ గురించే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారని జనసేన (Janasena) చీఫ్ పవన్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలనీయం అని పవన్ అన్నారు. టీడీపీ (TDP), జనసేన, బీజేపీ కలిసి పోటి చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు