BDK: దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని వారాంతపు సంత బహిరంగ వేలం ఈ నెల 25న నిర్వహించనున్నట్లు జీపీతీ కార్యదర్శి బండి అనంత కుమార్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉదయం 10 గంటలకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ వేలానికి రూ.1,15,000 మద్దతు ధరగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.