Cholera outbreak across Zimbabwe kills up to 100 people
Cholera: కలరా(Cholera) వ్యాధి పేరు చెబితే జింబాబ్వే వెన్నులో వణుకు పుడుతుంది. అపరిశుభ్రత.. ఇతర కారణాల వలన ఒకప్పుడు భారత్కు చుక్కలు చూపించిన ఈ మహమ్మారి ప్రస్తుతం జింబాబ్వే(Zimbabwe)ను వణికిస్తుంది. ఆ దేశం అంతటా కలరా వ్యాప్తి చెందుతోంది, సుమారు 100 మంది ఈ వ్యాధితో మరణించినట్లు అనుమానిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
2కోట్లు కూడా లేని ఈ దేశంలో వాతావరణ విపత్తులు ఏడాది అంతా ఉంటూనే ఉంటాయి. ఇక 2018 నుంచి మంటలు అడవుల్ని దహించడం, చుట్టు అపరిశుభ్ర పరిస్థితులు, అలాగే నీటినిలువ కారణంగా.. మురుగునీటి కాలువల వల్ల ఈ వ్యాధి ప్రభలినట్లు జింబాబ్వే(Zimbabwe) ప్రభుత్వం ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 4,609 అనుమానిత కేసులను నమోదు చేశారు. అందులో 935 కలరా కేసులకు చికిత్స అందిస్తున్నారు. అందులో కేవలం 30 మరణాలు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులుగా నిర్ధారించారు. జింబాబ్వేలో 2008, 2009లో కలరా వ్యాప్తి కారణంగా 4,000 మందికి పైగా మరణించారు. అలాగే 2018-2019లో ఈ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 10వేలకు మించిన అనుమానిత కేసులను గుర్తించినట్లు పేర్కొంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బావిలో నీటిని వాడడం, చెరువుల్లో, కుంటలలో నీటిని ఇంటి అవసరాలకు వాడడమే కలరా వ్యాప్తికి కారణం అని పేర్కొంది. ప్రజల అవసరాల మేరకు బోరు పంపులు వేయడం లాంటి కార్యక్రమాలను కూడా ఆ దేశ ప్రభుత్వం చేపట్టింది. అయినా సరే ఇంకా మారుమూల ప్రాంతాలలో ప్రజలు నీటికోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కలరాను నిరోధించడానికి ప్రభుత్వంతో పాటు సామాజిక సేవా సంఘాలు కూడా శ్రమిస్తున్నాయి.