»Death Toll Rises To 14 In Sikkim Floods More Than 102 Missing
Sikkim: వరదల్లో 14కు చేరిన మృతులు..100కుపైగా మిస్సింగ్
సిక్కింలో ఇటివల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 14 మంది మృతి చెందగా..100కుపైగా తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ నంబర్, తాత్కాలిక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.
Death toll rises to 14 in Sikkim floods More than 102 missing
సిక్కిం(Sikkim) ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 14కి చేరుకోగా, 100 మందికి పైగా గల్లంతైనట్లు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ధృవీకరించింది. తప్పిపోయిన 102 మందిలో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు పరిధిలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో 26 మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. బాధిత ప్రాంతాల్లో అత్యవసర సేవలను అందిస్తున్నారు. ఏదైనా సహాయం ఈ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని ప్రభుత్వం పౌరులకు సూచించింది. 03592-202892, 03592-221152, 8001763383, 03592-202042 అత్యవసర సహాయం కోసం ‘112’కి కాల్ చేయాలని తెలిపింది. భారత సైన్యం తన సొంత సైనికులతో సహా సిక్కింలో తప్పిపోయిన వ్యక్తుల కుటుంబాల కోసం మూడు హెల్ప్లైన్లను కూడా ప్రారంభించింది. ఉత్తర సిక్కింలో సహాయం కోసం 8750887741, తూర్పు సిక్కిం కోసం 8756991895, తప్పిపోయిన 22 మంది సైనికులకు సంబంధించిన విచారణల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 7588302011 సంప్రదించాలని అధికారులు తెలిపారు.
ఈ విపత్తు(floods) తర్వాత తప్పిపోయిన లేదా గాయపడిన వ్యక్తులలో అనేక మంది నివాసితులు మంగన్ జిల్లాలోని చుంగ్తాంగ్, అలాగే గాంగ్టక్ జిల్లాలోని డిక్చు, సింగ్టామ్, పాక్యోంగ్ జిల్లాలోని రంగ్పోకు చెందినవారని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత చుంగ్తాంగ్ ఆనకట్ట సొరంగంలో చిక్కుకుపోయిన ప్రజలను, పర్యాటకులను తరలిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 3,000 మందికి పైగా పర్యాటకులు రాష్ట్రంలో చిక్కుకుపోయారని సిక్కిం చీఫ్ సెక్రటరీ వీబీ పాఠక్ తెలిపారు. ప్రస్తుతానికి అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అక్కడి ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రజలకు సూచించారు.