తెలంగాణ(Telangana)లో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక జాబితాను వెల్లడించింది. పోలీసు శాఖలోని వేర్వేరు విభాగాల్లో 15,750 కానిస్టేబుళ్ల (Constables) భర్తీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. వీరిలో 2,884మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఈ మేరకు పోలీస్రిక్రూట్మెంట్బోర్డు ఛైర్మన్వీ.వీ. శ్రీనివాసరావు (Srinivasa Rao) ఓ ప్రకటన విడుదల చేశారు.
మొత్తం 16,604 పోస్టులకు పరీక్షలు జరుపగా 15,750 మంది ఎంపికైనట్టు ఆయన పేర్కొన్నారు. సివిల్పోలీసు (Civil Police) విభాగంలో 3,298 మంది పురుషులు, 1,622మంది మహిళలు, ఏఆర్విభాగంలో 2,982 పురుషులు, 948మంది మహిళలు, ఎస్ఏఆర్సీపీఎల్(మెన్) 100మంది పురుషులు ఎంపికైనట్టు తెలియచేశారు. టీఎస్ఎస్పీ (మెన్) విభాగానికి 4,725మంది పురుష అభ్యర్థులు పరీక్షల్లో విజయం సాధించినట్టు తెలిపారు.
తెలంగాణ స్టేట్స్పెషల్ప్రొటెక్షన్ఫోర్స్విభాగంలో 382మంది పురుష అభ్యర్థులు కొత్తగా నియమితులు కానున్నట్టు చెప్పారు. అగ్నిమాపక శాఖలో 599మంది పురుషులు, జైళ్లశాఖ(PrisonsDept)లో 136మంది పురుషులు, 10మంది మహిళా అభ్యర్థులు నియామకం కానున్నట్టు తెలియచేశారు. ఇన్ఫర్మేషన్టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ఆర్గనైజేషన్స్వింగ్కు 171మంది పురుషులు(Men), 86మంది మహిళలు ఎంపికైనట్టు చెప్పారు పోలీస్ట్రాన్స్పోర్టు విభాగంలో కొత్తగా 21మంది పురుష అభ్యర్థులు నియామకం జరుగనున్నట్టు వివరించారు