»Rojas Counter On Bandaru Satyanarayanas Words Emotional And Cried
Roja cried: అప్పటినుంచే వేధిస్తున్నారు కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా
మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు. ఆయన మాట్లాడినా చెప్పడానికి కూడా కుదరదు అంటూ భావోద్వేగానికి లోన్నయ్యారు.
Roja cried: తనపై మాజీమంత్రి బండారు సత్యనారణ(Bandaru Satyanarayana) చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరియైనది కాదని ఏపీ పర్యాటక మంత్రి రోజా(Roja) అన్నారు. లోకేష్(Lokesh)తో పాటు ఇతర నేతలందరూ బండారు సత్యనారాయణ అరెస్ట్‌ను ఖండించారు. వారి తల్లులకు, భార్యలకు, కూతుళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలానే స్పందిస్తారా అని అన్నారు. ఒక మహిళపై ఇలాంటి మాటలు మీడియా ముఖంగా ఎలా మాట్లాడుతారు అని కన్నీళ్లు పెట్టుకుంది. తాను టీడీపీ పార్టీని విడిచి వైసీపీలో చేరిన నాటి నుంచి వారు ఇలానే వేధిస్తున్నారని తెలిపింది. తాను బ్లూ ఫిల్మ్‌లో నటించిందని పదే పదే అంటున్నారని, అసెంబ్లీలో కూడా సీడీలను చూపించారు కాని నిరుపించలేదని పేర్కొంది. తాను సినిమా నటిని అయినంతా మాత్రనా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఉందా అని అయినా మహిళలున తమకు నచ్చిన రంగంలో తమ నచ్చినట్లుగా బ్రతకమని సుప్రీంకోర్టే చెప్పిందని తెలిపారు. తన క్యారెక్టర్ గురించి మాట్లాడానికి మీరెవరని, టీడీపీ పార్టీ మహిళలను ఆట వస్తువులుగా చూస్తోందని రోజా భావోద్వేగానికి గురయ్యారు.