తెలంగాణ(Telangana)లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలోని ప్రధాని పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యుహాలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకుు వేట సాగిస్తున్నాయి.అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మందితో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయగా.. కాంగ్రెస్(Congress), బీజేపీ దరఖాస్తులు స్వీకరించి.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేపట్టాయి. ఇదిలా ఉండగా..బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Praveenkumar) కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనుండడం తెలిసిందే.