చైనా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాలతో దూసుకుపోతోంది. తాజాగా నేడు భారత్ ఖాతాలోకి మరో మూడు పతకాలు చేరాయి. షూటింగ్లో రెండు పతకాలు, గోల్ఫ్‌లో ఒక పతకాన్ని భారత్ సాధించింది. ఆదివారం జరిగిన మహిళల గోల్ఫ్ పోటీల్లో అదితి అశోక్ (Aditi Ashok) రజత పతకాన్ని కైవశం చేసుకుంది. దీంతో గోల్ఫ్ క్రీడల్లో పతకం గెలిచిన మొదటి భారత మహిళగా అదితి అశోక్ రికార్డ్ నెలకొల్పింది.
1982లో లక్ష్మనన్ సింగ్ గోల్ఫ్‌లో భారత్ (India)కు గోల్డ్ మెడల్ (Gold Medal) అందించగా దాదాపు 41 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో (Asia games) భారత్‌కి గోల్ఫ్ ఈవెంట్లో స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అటు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్లో కూడా జోరావర్ సింగ్, చైనాయ్, పృథ్వీరాజ్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో భారత ప్రజలు మెడల్స్ సాధించిన క్రీడాకారులను ప్రశంసిస్తున్నారు.
మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో మనీషా, రాజేశ్వరి, ప్రీతి టీమ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకూ భారత్ 41 గోల్డ్ మెడల్స్, 16 రజత పతకాలు, 14 కాంస్య పతకాలను సాధించింది. 41 పతకాల్లో ఒక్క షూటింగ్ విభాగంలోనే 21 పతకాలను భారత్ సాధించడం విశేషం. ఆసియా గేమ్స్ పూర్తయ్యే సరికి భారత్ మరిన్ని పతకాలతో దూసుకెళ్లాలని భారత ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.