SAFF U19:లో పాక్ ను ఘోరంగా ఓడించి..భారత్ స్వర్ణ కైవసం
ఈరోజు ప్రధానంగా ఆసియా క్రీడల్లో పాకిస్తాన్ ఓటమి, భారత్ గెలుపు అదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పటికే ఈరోజు ఉదయం స్క్వాష్ ఫైనల్లో భారత్ గెలుపొందగా..తాజాగా హాకీలో కూడా పాకిస్తాన్ జట్టుపై 10-2 తేడాతో ఇండియా విజయం సాధించింది. అంతేకాదు SAFF U19 ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా భారత్..పాకిస్థాన్ టీంను ఇండియా ఓడించి గోల్డ్ గెల్చుకుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఓ వైపు చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా SAFF U19 ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత హాకీ జట్టు పాకిస్థాన్‌ను ఓడించి సర్ణం కైవసం చేసుకుంది. శనివారం ఖాట్మండులోని దశరథ్ స్టేడియంలో పాకిస్తాన్‌ను 3-0 తేడాతో చిత్తు చిత్తుగా ఓడించి SAFF భారత పురుషుల జట్టు U19 ఛాంపియన్ షిప్ టైటిల్ గెల్చుకుంది. దీంతో SAFF ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ఎనిమిదవ యూత్ టైటిల్ లభించింది.
ఈ అద్భుతమైన ప్రదర్శనలో ప్రత్యామ్నాయ ఆటగాడు మాంగ్లెంథాంగ్ కిప్జెన్ మరోసారి భారత జట్టుకు కీలక సపోర్ట్ ఇచ్చారు. బుధవారం జరిగిన సెమీ-ఫైనల్లో ఆతిథ్య నేపాల్‌పై పెనాల్టీ స్ట్రైక్ చేసి ఆకట్టుకున్నారు. ఆ క్రమంలో మొదటి రెండు గోల్స్ చేసి వావ్ అనిపించుకున్నాడు. కిప్జెన్ మూడవ గోల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఈరోజు ఆసియా క్రీడల్లో కూడా భారత పురుషుల హాకీ జట్టు పూల్ ఏ విభాగంలో పాకిస్తాన్ జట్టును 10-2 తేడాతో ఓడించింది. ఆట 53వ నిమిషంలో వరుణ్ కుమార్ భారత్ తరఫున 10వ గోల్ చేశాడు. 49వ నిమిషంలో భారత్ గోల్ నం.9లో లలిత్ ఉపాధ్యాయ్‌కు జర్మన్‌ప్రీత్ సింగ్ సహాయం అందించాడు. 46వ నిమిషంలో షంషేర్ ఫీల్డ్ గోల్ చేయడంతో పాకిస్థాన్‌పై భారత్ గోల్స్ సంఖ్య 8కి చేరుకుంది.