ATP: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని గుత్తి మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు.