ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఎంత సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
ఆర్ఆర్ఆర్ లోని `నాటు నాటు` పాటకు గానూ హాలీవుడ్ స్టార్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ పురస్కారాలని దక్కించుకుని భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త చరిత్రను ఆర్ఆర్ఆర్ మూవీ లిఖించింది. హాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ల ప్రశంసల్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి సీక్వెన్స్ వస్తుందని చాలా కాలంగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ పై అనుమానాలు ఇంకాస్త పెరిగాయి.
అంతర్గత నివేదికల ప్రకారం.. రాజమౌళి RRR పార్ట్ 2 ఆలోచనను తన మూవీ టీమ్ తో పంచుకున్నాడట. కానీ ఈ కథలో తాజా ట్విస్ట్ ఏమిటంటే ఈ చిత్రంలో కీలకమైన స్టార్లలో ఒకరైన రామ్ చరణ్ తన పాత్రను తిరిగి పోషించడానికి ఇష్టపడటం లేదు. ఈ ముఖ్యమైన విషయంలో సినీ పరిశ్రమలోని చాలా మందికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే మొదటి విడతలో రామ్ చరణ్ నటనకు అత్యంత ప్రశంసలు లభించాయి. మరి అలాంటి కథను సీక్వెన్స్ గా చేయడానికి చరణ్ ఎందుకు అంగీకరించడం లేదో అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ మాత్రం ఈ కథ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడని తెలుస్తోంది.