ఆసియా క్రీడలు 2023(asian games 2023)లో నేడు ఆరవరోజు ఉదయం భారత ఆటగాళ్లు వావ్ అనిపించారు. ఏకంగా ఐదు పతకాలను కైవసం చేసుకున్నారు. వాటిలో రెండు స్వర్ణ పతకాలు షూటింగ్‌లోనే రావడం విశేషం. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో(asian games 2023)శుక్రవారం(ఆరవ రోజు) ఉదయం భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఏకంగా ఐదు పతకాలను సాధించారు. షూటింగ్ నుంచి రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, టెన్నిస్ నుంచి ఒక రజతం వచ్చింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్లో పాలక్, ఈషా సింగ్, దివ్య తాడిగోల్లతో కూడిన భారత షూటింగ్ జట్టు రజతం సాధించింది. మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఫైనల్లో పాలక్, ఈషా వరుసగా స్వర్ణం, రజతం సాధించారు. అలాగే పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3పీ టీమ్ ఈవెంట్లో భారత బృందం (ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ సురేష్ కుసాలే, అఖిల్ షెరాన్) స్వర్ణం సాధించారు. అదే సమయంలో టెన్నిస్ స్టార్లు సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో ఓడి రజత(silver) పతకాన్ని కైవసం చేసుకున్నారు.
అలాగే రోహన్ బోపన్న, రుతుజా భోసలే తమ సెమీ-ఫైనల్ టై గెలిచిన తర్వాత కాంస్యం సాధించే అవకాశం ఉంది. శుక్రవారం జరిగే మహిళల హ్యామర్ త్రో ఫైనల్లో ఆడనున్న ఇద్దరు భారతీయులు రచన కుమారి, తాన్యా చౌదరి కూడా ఉన్నారు. కౌర్, కిరణ్ బలియన్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేస్తే పతకాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఆతిథ్య చైనా(china) 1986 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లోనూ అథ్లెటిక్స్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ క్రీడలు అక్టోబర్ 8 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు భారత్ గోల్డ్ – 8, వెండి – 12, కాంస్యం-11 పతకాలు సాధించింది.
పురుషుల, మహిళల స్క్వాష్ జట్లు రెండూ తమకు తాము కనీసం కాంస్య పతకాలను సాధించి సెమీఫైనల్ టైలు ఉంటాయని హామీ ఇచ్చాయి. పురుషుల డబుల్స్, సింగిల్స్, మహిళల డబుల్స్ జరుగుతున్నందున భారతదేశ టేబుల్ టెన్నిస్ స్టార్లు శరత్ కమల్, జి సత్యన్, సుతీర్థ ముఖర్జీలు పతకం గెల్చుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో భారత మహిళల హాకీ జట్టు(hockey team) మలేషియాతో తలపడుతుండగా.. ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో జోర్డాన్‌కు చెందిన హనన్ నాసర్తో తలపడనుంది.