వన్డే ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధమైంది. అయితే ఆఖరి నిమిషంలో టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు. ఇటీవలె ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరుగుతుండగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. దీంతో ఆసియా కప్ ఫైనల్‌కు కూడా ఆడలేకపోయాడు. వరల్డ్ కప్ నాటికి కోలుకుంటాడని అందరూ భావించారు. అయితే ఆ సూచనలు కనిపించకపోవడంతో చివరి నిమిషంలో టీమిండియాలో మార్పు చేశారు.
టీమిండియా నుంచి అక్షర్ పటేల్‌ను తప్పించి, ఆ స్థానంలో సీనియర్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటిచ్చారు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన వారిలో ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేకపోవడంతో బీసీసీఐ, సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఎడమచేతివాటం స్పిన్నర్లే కావడంతో అశ్విన్‌ను తీసుకున్నారు.