KNR: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి తలంబ్రాలు భక్తుల ఇంటికి డెలివరీ చేయాలని టీజీఆర్టీసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ పోస్టర్ ఆవిష్కరించారు. భక్తులు లాజిస్టిక్ కేంద్రంలో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసిన తర్వాతే తలంబ్రాలు డెలివరీ జరుగుతుందన్నారు. వివరాలకు 9154298559 నంబర్‌ను సంప్రదించాలన్నారు.