NLR: నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రాత్రి లారీ అదుపుతప్పి మెయిన్ రోడ్డుకు మధ్యనున్న డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.