»Researchers Who Discovered The Eighth Continent Identified A New Continent After 375 Years
Zealandia: ఎనిమిదో ఖండాన్ని కనిపెట్టిన పరిశోధకులు..375 ఏళ్ల తర్వాత కొత్త ఖండం గుర్తింపు
ప్రపంచంలో 8వ ఖండాన్ని పరిశోధకులు గుర్తించారు. న్యూజిలాండ్‌కు చేరులో ఈ ఖండం ఉందని, పసిఫిక్ మహా సముద్రంలో 94 శాతం నీటిలో ఈ ఖండం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
భూగోళంపై ఇప్పటి వరకూ 7 ఖండాలు (7 continents ) మాత్రమే ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి చేరింది. సుమారు 375 సంవత్సరాల తర్వాత పరిశోధకులు ఆ కొత్త ఖండాన్ని గుర్తించారు. 2017లోనే ఈ ఖండం వెలుగులోకి వచ్చింది. అయితే దాని ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించినట్లుగా వెల్లడించారు. ఆక్లాండ్ లోని న్యూజిలాండ్ క్రౌన్ రిసెర్చ్ ఇనిస్టిట్యూల్ జీఎన్ఎస్ సైన్స్ శాస్త్రవేత్తలు (GNS Science scientists) ఈ కొత్త ఖండం మ్యాప్‌ను రిలీజ్ చేశారు.
ఇప్పటి వరకూ ఉన్న ఏడు ఖండాల సరసన కొత్తగా ఈ జిలాండియా (Zealandia) అనే కొత్త ఖండం వచ్చి చేరింది. దీంతో ఖండాల సంఖ్య ఎనిమిదికి చేరనుంది. అతి ప్రాచీన ఖండం అయిన గోండ్వానాలో ఈ జిలాండియా ఖండం భాగమై ఉంది. అయితే కాలక్రమేణా ఇది వేరుపడింది. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు అని , ఇది మడగాస్కర్కు ఆరు రెట్లు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean)లో 2 కిలోమీటర్ల లోతులో ఈ ఖండం ఉందని, ఇది సుమారుగా 94 శాతం నీటిలోనే ఉందని, అక్కడంతా చిన్న చిన్న దీవులతో న్యూజిలాండ్ మాదిరిగానే ఉందని పరిశోధకులు తెలిపారు. 1642లో డచ్ సెయిలర్ అబెల్ టాన్మాన్ మొదటిసారిగా జిలాండియా గురించి ప్రపంచానికి తెలిపింది. అయితే అది ఉన్నట్లు సరైన ఆధారాలను చూపలేకపోయింది. 375 ఏళ్ల తర్వాత జీఎన్ఎస్ పరిశోధకులు జిలాండియా ఉనికిని గుర్తించడం విశేషం. అయితే ఈ ఖండం గోండ్వానా నుంచి ఎందుకు వేరుపడిందో నిపుణులకు అంతుచిక్కనిదిగా ఉంది.
ఖండం పేరు: జీలాండియా విస్తీర్ణం: 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు (మడగాస్కర్కు ఆరు రెట్లు ఉంది) ప్రాంతం: పసిఫిక్ మహా సముద్రంలో. 2 కిలోమీటర్ల లోతులో ఉంది. భూభాగం: మొత్తం విస్తీర్ణంలో 94% నీటిలోనే ఉంది.