క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది జరగనున్న అండర్ 19 ప్రపంచ కప్(Under 19 World Cup 2024) షెడ్యూల్ రానే వచ్చింది. ఈ 15వ ఎడిషన్ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు కొలంబోలోని ఐదు వేదికలలో జరుగుతుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) శ్రీలంకలో జరగబోయే పురుషుల అండర్-19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. ఇది 15వ ఎడిషన్ జూనియర్ వరల్డ్ కప్. ఇది శ్రీలంక రాజధాని కొలంబోలోని ఐదు వేదికలలో జరుగనుంది. U19 ప్రపంచ కప్ 2024 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు, జనవరి 6 నుంచి 12 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా జనవరి 14న 2020 ఛాంపియన్ బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచును ఆడనుంది. బంగ్లాదేశ్‌తో పాటు, ఐర్లాండ్, యుఎస్‌ఎలు భారత్‌తో పాటు గ్రూప్ Aలో ఉన్నాయి. ఒక్కో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. ఐసీసీ అండర్ 19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ నుంచి పలువురు కీలక ఆటగాళ్లను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసిన సుదీర్ఘ చరిత్ర ఉందని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ అన్నారు. వారిలో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, ఏంజెలో మాథ్యూస్ వంటి అనేక మంది ఆటగాళ్లు ఉన్నట్లు గుర్తు చేశారు.
గ్రూప్ A, గ్రూప్ D నుంచి మూడు జట్లు సూపర్ సిక్స్(super six)లో ఒక గ్రూప్‌లో ఉంటాయి. అయితే B, C గ్రూప్‌ల నుంచి మొదటి మూడు జట్లను సూపర్ సిక్స్‌లోని మరొక గ్రూప్‌లో కలుపుతారు. క్వాలిఫైయర్ల మాదిరిగానే ఫార్మాట్లో మార్పు చేస్తే అర్హత సాధించిన జట్లు తమ పాయింట్లను సూపర్ సిక్స్‌కు చేరుస్తాయి. ఉదహారణకు గ్రూప్ A నుంచి భారతదేశం, బంగ్లాదేశ్, ఐర్లాండ్ సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తే, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లపై టీమిండియా పాయింట్లు తదుపరి దశకు చేరుకుంటాయి.
సూపర్ సిక్స్‌లో ఒక జట్టు ఇతర గ్రూప్‌లోని రెండు జట్లతో గ్రూప్ స్టేజ్‌లో వేర్వేరు స్థానాల్లో నిలిచిన వారితో ఆడుతుంది. కాబట్టి A1 గ్రూప్ Dలో రెండు, మూడవ స్థానంలో నిలిచిన జట్లతో అదే విధంగా B2 గ్రూప్ Cలో మొదటి, మూడో స్థానంలో నిలిచిన జట్లతో తలపడుతుంది. సూపర్ సిక్స్‌లోని ప్రతి గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 30, ఫిబ్రవరి 1న ఆర్ ప్రేమదాస స్టేడియంలో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ ఫిబ్రవరి 4, పీ సారా ఓవల్‌లో జరుగుతుంది. ఇక ఈ గేమ్స్ శ్రీలంక(sri lanka)లోని నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్, ఆర్.ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, పి.సారా ఓవల్ కొలంబో, కొలంబో క్రికెట్ క్లబ్, సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియాలల్లో జరగనున్నాయి.