ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ (Viral Fever)తో బాధపడుతున్నాడు. మరోవైపు రేపటి నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ (CM Jagan) అపాయింట్మెంట్లన్నీ రద్దు చేశారు.
కేబినెట్ సమావేశం (Cabinet Meeting)లో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎంతో అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) వ్యూహాలపై పలువురు ముఖ్యనేతలు చర్చించారు. ఏపీ మంత్రులు బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డిలతో పాటుగా ప్రభుత్వ విప్లు సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ (CM Jagan) అపాయింట్మెంట్లన్నీ కూడా అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతినిచ్చారు. ఒక వేళ జ్వరం తగ్గకపోతే రేపు అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ వచ్చే అవకాశం లేదని కొందరు చర్చించుకుంటున్నారు.