ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలను సమర్పించారు.
తిరుమల (Tirumala)లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున శ్రీవారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) పట్టు వస్త్రాలను సమర్పించారు. మొదటగా సీఎం జగన్కు ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రాల మధ్య ఆశీర్వచనాలు చేశారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల (Tirumala Srivari Bramhotsavams) సందర్భంగా ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharmareddy) వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కారణంగా ప్రత్యేక దర్శనాలు ఉండవన్నారు. భక్తుల సౌకర్యార్థం బ్రహ్మోత్సవాల సందర్భంగా జర్మన్ షెడ్లు, లాకర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తాయని తెలిపారు. వన్యప్రాణుల సంచారం దృష్ట్యా పాదచారులు, ఘాట్ రోడ్లపై ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 22న గరుడ సేవ, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు.