HYD: మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం రూ. 28,740 కోట్లు ఇస్తామని చెబుతున్నా అదంతా ఒక ‘కండిషన్’ మీద ఆధారపడి ఉంది. ఫేజ్-1 నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకుని రాష్ట్ర ప్రభుత్వం పక్కా డీపీఆర్ సమర్పిస్తేనే పైసలు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో మెట్రో కోసం కేటాయిస్తున్న నిధులు కేవలం ‘మ్యాచింగ్ గ్రాంట్స్’ గానే కనిపించనున్నాయి.