Haldi ఫంక్షన్లో శ్రావణ భార్గవి.. రెండో పెళ్లా..? అంటూ చర్చ..?
ప్రముఖ సింగర్స్ శ్రావణ భార్గవి- హేమ చంద్ర జంట విడిపోతున్నారనే తెగ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి స్టేజ్ షోలలో కనిపించకపోవడం.. భార్గవి హల్దీ ఫంక్షన్లో పాల్గొనడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Sravana Bhargavi: ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి (Sravana Bhargavi) హల్దీ ఫంక్షన్లో హల్ చల్ చేశారు. దీంతో ఆమె రెండో పెళ్లా..? అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి. గాయకుడు, సంగీత దర్శకుడు హేమచంద్రను భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది. ఇద్దరు కలిసి ఉంటున్నారు. కానీ స్టేజీ షో, పాటలు పాడటానికి మాత్రం కలిసి రావడం లేదు. సో.. అందుకే వారు వీడిపోయారా అనే సందేహాం కలిగింది.
హల్దీ ఫంక్షన్లో మెరవడంతో సందేహాలు వస్తున్నాయి. భార్య భర్తలు దూరంగా ఉండటం.. కలిసి స్టేజీ షో చేయకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. భార్గవి రెండో పెళ్లి చేసుకుంటుందా..? హేమచంద్రకు విడాకులు ఇచ్చిందా అని ఒక్కటే చర్చ.. మరీ వారి పాప సంగతి అంటూ ఒక్కటే పోస్టులు.. కానీ ఆ ఫోటోస్ పాతవి అని.. దట్ టు.. భార్గవి సోదరుడు హరీశ్ హల్దీ ఫంక్షన్ ఫోటోలు అని ఆలస్యంగా తెలిసింది. దీంతో విడాకులు లేవు.. ఏం లేవు అని ఓ క్లారిటీ వచ్చింది.
హేమచంద్ర- శ్రావణ భార్గవి (Sravana Bhargavi) కలిసి కనిపించడం లేదు. అంతే.. దానికే వారు కలిసి ఉండటం లేదు. వీడిపోతున్నారా అని నెటిజన్లు ఊహించుకున్నారు. విడాకులు లేవు.. దానిపై ఇద్దరూ స్పందించలేదు. ఇప్పటికీ కలిసి ఉంటున్నారు. ఏదో హల్దీ ఫంక్షన్లో కనిపిస్తే.. పసుపు రాసుకుందని, మరో పెళ్లి చేసుకోబోతుందని కథ అల్లేశారు. ఆ రూమార్స్ గురించి హేమచంద్ర, శ్రావణ భార్గవి (Sravana Bhargavi) సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
సినీ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లిళ్లు కామనే. కొందరు కలిసుంటే.. మరికొందరు విడిపోతుంటారు. శ్రావణ భార్గవి (Sravana Bhargavi)- హేమచంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్టేజ్ షోలలో కనిపించకుంటే.. ఇక విడిపోతున్నారని ప్రచారం అవుతోంది. అదీ నిజం కాదని జంట క్లారిటీ ఇచ్చారు.