ప్రముఖ నటి అనసూయ (Anasuya) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె కొన్నిరోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. తాజాగా ఆమె వరుస ట్వీట్స్ చేశారు. ‘వైరల్ ఫీవర్ (Viral fever) 5రోజుల నుంచి బాధపడుతున్నా. దాని వల్ల ఆన్లైన్లో ఎక్కువ సమయం ఉండటానికి కుదిరింది. ఇక్కడ ఎన్నో విషయాలు గుర్తించా. ఎదుటి వ్యక్తుల పట్ల దయ, జాలి లేకపోగా.. వేధింపులు (Harassment) ఉన్నాయి. మనం ఎటు వెళ్తున్నామని ఆశ్చర్యపోయా’ అని పేర్కొన్నారు. దాని వల్ల సోషల్ మీడియా(Social media)లో ఎక్కువ సమయం ఉండటానికి వీలు కుదిరింది.
ఈ వేదికగా ఎన్నో విషయాలు గుర్తించా. ఎదుటి వ్యక్తుల పట్ల దయ, జాలి లేకపోవడం చూశా. వేధింపులు మాత్రం బాగా కనిపిస్తున్నాయి. హుందాతనం లోపించడం కారణంగా మనం ఎటు వెళ్తున్నామని ఆశ్చర్యపోయా’’ అని ఆమె పేర్కొన్నారు. అంతే కాదు నెట్టింట జరిగే ఫ్యాన్ వార్స్(Fan Wars)ను ఉద్దేశించి ఆమె మాట్లాడింది. ‘‘సినీ పరిశ్రమలో ఇప్పుడు స్టార్ హోదాలో ఉన్న వారందరూ ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు చవి చూసిన వారే. పీఆర్ ప్రమోషన్స్ (PR Promotions) లేకుండా.. ఎన్నో ఎత్తుపల్లాలు చూసి.. తమ సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకుని ఉన్నత స్థాయికి వచ్చారు. వారి ప్రయాణాన్ని గౌరవించాలి’’ అని అనసూయ నెటిజన్లను కోరారు.