»The Young Woman Was Raped By The Canteen Staff In The Erragadda Esi Hospital
ESI hospital:లో యువతిపై క్యాంటీన్ సిబ్బంది అత్యాచారం
ఆస్పత్రులకు వెళ్తున్నారా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఎక్కడ చుసినా కామాంధులే తయారయ్యారు. గతంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి రాగా..తాజాగా ఏకంగా హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రిలోనే ఓ వ్యక్తి యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం పోలీసులకు తెలుపడంతో బహిర్గతమైంది.
The young woman was raped by the canteen staff in the erragadda ESI hospital
హైదరాబాద్(hyderabad) ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి(esi hospital)లో దారుణం జరిగింది. 24 ఏళ్ల యువతిపై అక్కడి క్యాంటీన్ సిబ్బంది షాదాబ్ (25) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆసుపత్రి ఆవరణలో ఈ ఘటన జరిగింది. నిందితుడు ఈఎస్ఐ క్యాంటీన్లో చపాతీలు తయారు చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు బాధితురాలిని బలవంతంగా కారిడార్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిపై ఐపిసి సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
అయితే ఆ మహిళ రెండు రోజుల క్రితం తన సోదరుడి చికిత్స(brother treatment) కోసం సహాయకురాలిగా ఆస్పత్రికి వచ్చింది. ఆ క్రమంలో శుక్రవారం సాయంత్రం సోదరుడికి ఆహారం కోసం వెళ్లిన ఆమెకు సెక్యురిటీ గార్డు అక్కడి క్యాంటిన్లో పనిచేసే షాదాబ్ (25)ను పరియచం చేశాడు. ఏదైనా సాయం కావాలంటే అతన్ని అడగాలని చెప్పాడు. ఆ క్రమంలో ఆమె తిరిగి లిఫ్టులో వెళ్తున్న క్రమంలో ఆమె వెనుకనే షాదాబ్ కూడా వెళ్లాడు. ఆమెను బలవంతంగా రెండో అంతస్తుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత రక్త పరీక్షలు చేసే గదిలో మరోసారి అఘాయిత్యం చేశాడు. అయితే ఈ విషయం యువతి తన సోదరుడి చెప్పడంతో అతను వచ్చి ఆస్పత్రిలో అరుపులు చేసి ఆందోళన చేయండంతో అతను పరరాయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.