PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంత ఆది జాంబవ అరుంధతి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం శ్రీ పోచమ్మ తల్లికి బోనాల జాతర నిర్వహించారు. వివిధ డివిజన్లకు చెందిన సేవా సమితి సభ్యుల కుటుంబాలు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గోదావరిఖని పట్టణంలోని వివిధ కాలనీల నుంచి బోనాలు డప్పు చప్పుళ్లు ఆటపాటలతో పోచమ్మ గుడికి తరలి వెళ్లారు.