»Ysr Kapu Nestham Funds Deposited In Accounts September 16th 2023 Rs 15000
YSR Kapu Nestham: నేడు అకౌంట్లలో రూ.15 వేలు జమ..3 లక్షల మందికిపైగా లబ్ధి
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ కార్యక్రమం ద్వారా వరుసగా నాలుగో ఏడాది ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈరోజు(సెప్టెంబర్ 16న) నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి పంపిణీ చేయనున్నారు.
YSR Kapu Nestham funds deposited in accounts september 16th 2023 rs 15000
ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘వైఎస్ఆర్ కాపు నేస్తం(YSR Kapu Nestham)’ కార్యక్రమం ద్వారా వరుసగా నాలుగో ఏడాది ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. పార్టీ మేనిఫెస్టోలో లేకపోయినా కాపు సామాజిక వర్గానికి ఈ సాయం అందజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శనివారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
మొత్తం అర్హులైన 3,57,844 మంది మహిళా లబ్ధిదారులకు రూ.536.77 కోట్లు(funds) విడుదల చేయనున్నారు. ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ పథకం కింద ప్రభుత్వం ఏటా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు రూ.15,000 అందిస్తున్నారు. ఈ సాయం మొత్తం ఐదు సంవత్సరాలలో రూ.75,000. ఈ తాజా నిధుల విడుదలతో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా అందించిన మొత్తం ఆర్థిక సహాయం రూ.2,029 కోట్లు అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాపు సామాజికవర్గానికి చెందిన మహిళల జీవన ప్రమాణాలను పెంచడం కోసమే ఈ స్కీం ఏర్పాటు చేసినట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది.
ఈ కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(cm jagan mohan reddy) నేడు(సెప్టెంబర్ 16న) నిడదవోలులో పర్యటించనున్నారు. సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ‘వైఎస్ఆర్ కాపు నేస్తం’ కార్యక్రమం కింద బటన్ నొక్కడం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆర్థిక సాయం జమ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.