Congress: కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభించాయి. అందులో యూత్ కాంగ్రెస్ ఖాతాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అజయ్ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపజేసిందని తెలిపారు. విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ప్రస్తుతం చేతిలో ఒక్క రుపాయి కూడా లేదని తెలిపారు.
हिंदुस्तान में लोकतंत्र पूरी तरह से खत्म हो चुका है।
देश की मुख्य विपक्षी पार्टी के सारे अकाउंट्स फ्रीज कर दिए गए हैं। भारतीय राष्ट्रीय कांग्रेस के अकाउंट पर तालाबंदी कर दी गई है।
ये कांग्रेस पार्टी के अकाउंट्स फ्रीज नहीं हुए, हमारे देश का लोकतंत्र फ्रीज हो गया है।
న్యాయ యాత్రతో పాటు పార్టీకి చెందని రాజకీయ కార్యకలాపాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. జారీ చేసిన చెక్కులను బ్యాంకులు అంగీకరించడం లేదని కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందింది. కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బు నిలిచిపోయిందని మాకెన్ తెలిపారు. రూ.210 కోట్ల పన్ను రికవరీ నిమిత్తం ఆదాయపన్ను శాఖ ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది ప్రజాస్వమ్యంపై దాడి అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు. కానీ మేం క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించుకున్న నిధుల్ని అడ్డుకుంటారన్నారు. అందుకే.. భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని నేను చెప్పాను. దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని న్యాయవ్యవస్థను అభ్యర్థిస్తున్నాను’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. దీనిపై తాము చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆ పార్టీ తెలిపింది.