ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21వ తేది నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కొత్త బిల్లులను ఏపీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. మొత్తం 5 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. అవసరం అయితే మరో రెండు రోజులు కూడా పొడిగించే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 21వ తేది నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 21 నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఒక వేళ అవసరం అయితే మరో రెండు రోజులు పెంచే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీపీఎస్ ఉద్యోగుల కోసం ఏపీ సర్కార్ తీసుకురావాలనుకుంటున్న జీపీఎస్ సంబంధిత బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం రూపొందించిన పలు ప్రతిపాదనలపై ఉద్యోగులు కొన్ని మార్పులు కోరారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ కానుంది. ఇవే కాకుండా మరికొన్ని ఆర్డినెన్సుల బిల్లులను, ఇంకొన్ని కొత్త బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది.
అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశమవ్వనున్నారు. సెప్టెంబర్ 21వ తేది నుంచి ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి.