Purandeswari: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై (Purandeswari) వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె టీడీపీ కోవర్టు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీలో చాలా మంది టీడీపీ కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేన మద్దతు తెలుపడంపై కూడా స్పందించారు. జనసేన ప్రస్తుతం బీజేపీలో ఉందని.. భవిష్యత్‌లో టీడీపీతో కలుస్తుందనే అభిప్రాయం ఉందన్నారు. అందుకోసమే టీడీపీకి పవన్ సపోర్ట్ చేస్తున్నారని వివరించారు.
చంద్రబాబు (chandrababu) జైలులో ఉండడానికి పరోక్షంగా రామోజీ రావు కారణం అని సాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు (chandrababu) నేర స్వభావం కలిగిన వ్యక్తి అని వివరించారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారడానికి కారణం ఆయనే కారణం అని తెలిపారు. ఓటుకు నోటు కేసు, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్.. అన్నింట్లో స్కామ్ చేశారని పేర్కొన్నారు. టీడీపీ బంద్ నేపథ్యంలో హెరిటేజ్ దుకాణాలు కూడా మూయలేదని విజయసాయిరెడ్డి వివరించారు.
హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో షెల్ కంపెనీల ద్వారా బినామీ అకౌంట్లలోకి నిధులను మళ్లించారని వివరించారు. తనపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి స్టే తెచ్చుకున్నారని.. అలా చేయకుంటే బాగుండేదని వివరించారు.