స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు విజయవాడ (Vijayawada) ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. భద్రతా కారణాల నేపథ్యంలో హౌస్ రిమాండ్లో ఉంచాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించగా పిటిషన్ను తిరస్కరించింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు చూపిన భద్రతా కారణాలను చూపుతూ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. భద్రతపై చంద్రబాబు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించని కోర్టు.. రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైలులో ముప్పులేదన్న సీఐడ (CID) వాదనలతో ఏకీభవించింది.