»Opal Capital Of World A Strange Town With Houses In The Underworld Every House Is A Pile Of Gems
Opal Capital of World : పాతాళంలో గృహాలుండే వింత ఊరు..ప్రతి ఇల్లూ ఓ రత్నాల గుట్ట!
రత్నాల గనుల కింద ఓ ఊరుంది. గ్రామంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ భూగర్భంలో మాత్రం అంత వేడి ఉండదు. చల్లగా ఉండటం వల్ల పాతాళంలోనే అందరూ ఇళ్లను నిర్మించుకున్నారు.
రత్నాల గనుల మధ్య ఓ ఊరుంది. అది కూడా భూమిపై కాదు. పాతాళంలో ఉండే ఆ ఊరి ఇళ్లు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ ఊళ్లో మొత్తం ఇళ్లు, హోటల్స్, ఆఖరికి ప్రార్థనా మందిరాలు, షాపులు కూడా గుట్టల్లోనే ఏర్పాటు చేసుకున్నారు. భూగర్భంలో ఉండే ఆ ఊరిని ‘ఓపల్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ఓపల్ రత్నాలు దొరుకుతుంటాయి. ఊరు మొత్తం రంగు రంగు గనులు ఉండటం విశేషం.
ఊర్లో ఉండే గుట్టల్లో ఒక్కోదానిలో ఒక్కో ఇల్లు ఉంటుంది. ఈ వింత ఊరు దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలాయిడ్ నగరానికి 846 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ఊరి పేరే ‘కూబర్ పెడీ’ (Coober Pedy). ఊర్లోని జనాభా దాదాపు 25000 ఉన్నారు. ఓపల్ రత్నాలు దొరికే గ్రామం కాబట్టి ఈ ఊరిని ఓపల్ కేపిటల్ ఆఫ్ ద వరల్డ్ ( Opal Capital of World ) అని పిలుస్తారు. ఈ ఓపల్ రత్నాలకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది.
ఊర్లో దాదాపు డెబ్భైకి పైగా ఓపల్ గనులు ఉండటమే కాకుండా ఇళ్లు, హోటల్స్, ప్రార్థనా మందిరాలు, పబ్బులు, షాపులు అన్నీ కూడా భూగర్భంలోనే ఉండటంతో ఈ ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తోంది. ఈ ఊరు ఎడారి ప్రాంతంలో ఉండటంతో అక్కడి వేడిని తట్టుకోవడం చాలా కష్టం. వేసవిలో అయితే 50 నుంచి 113 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు ఉంటాయి. పైకి అంత వేడిగా ఉండే గ్రామం భూగర్భంలో మాత్రం చల్లగా ఉంటుంది.