సుకుమార్ జస్ట్ రీజనల్ లెవల్లో ఆలోచించి చేసిన సినిమా పుష్ప పార్ట్ వన్. ఈ సినిమా బౌండరీస్ దాటి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అలాంటిది సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పుష్పరాజ్ గోరు కథ మాత్రం అంతు పట్టకుండా ఉంది.
Pushpa: స్క్రిప్ట్ కోసమే సుకుమార్ ఏడాది సమయం తీసుకున్నాడంటే.. ఈసారి పుష్పగాడి రూల్ మామూలుగా ఉండదని చెప్పొచ్చు. ప్రస్తుతం పుష్ప2ని అంతకుమించి అనేలా తెరకెక్కిస్తున్నాడు సుక్కు. అవుట్ పుట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవకుండా షూటింగ్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశాడు. పక్కా ప్లానింగ్‌తో పుష్ప2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. పుష్పగాడి బాక్సాఫీస్ రూలింగ్ 2024 ఆగస్టు 15న స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో బన్నీ చేతికున్న గోల్డ్ మరియు చిటికెన వేలి గోరు హైలెట్‌గా నిలిచింది.
ఇంతకు ముందు రిలీజ్ చేసిన పుష్ప2 (Pushpa-2) వీడియోలో చిటికిన వేలు గోరుని రెడ్ కలర్లో హైలెట్ అయ్యేలా చూపించారు. నైట్ విజన్ విజువల్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటే.. ఆ ఒక్క గోరుని మాత్రమే రెడ్ కలర్లో హైలైట్ చేసి చూపించారు. దీంతో గోరు ఎందుకు పెంచాడు. రెడ్ కలర్‌ను ఎందుకు హైలెట్ చేశారనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది. అమ్మవారి వేషధారణ కోసమే.. ఆ గోరుని హైలెట్ చేశారనే టాక్ నడిచింది. అలాగే చిత్తూరు ప్రాంతంలో అదో ఆచారం అని.. సినిమా మొత్తం ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాపే కాబట్టి.. రెడ్ సింబల్‌ని ఇలా కూడా హైలెట్ చేసి ఉంటారని వినిపించింది.
మరోసారి ఆ గోరునే హైలెట్ చేయడంతో కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ చిటికెన వేలు వెనుక పెద్ద కథ ఉన్నట్లు తెలుస్తోంది. సంస్కృతికి పెద్ద పీట వేసే పురుషులు ఇలా చేతి చిటికెన వేలుకి నెయిల్ పాలిష్ చేసుకుంటారట. దీన్ని సంపద, ఉన్నత సామాజిక స్థితికి సూచనగా కూడా భావిస్తారట. ఇదొక్కటే కాదు ఈ పోస్టర్‌ను జాగ్రత్తగా గమనిస్తే.. చాలా డెప్త్ మ్యాటర్ ఉందని అంటున్నారు. పుష్పరాజ్ ఇతర దేశాలకు పారిపోయినట్టుగా పుష్ప-2 టైటిల్ లోగో గమనిస్తే తెలుస్తుంది. అందులో గ్రీన్ కలర్లో చైనా డ్రాగన్ తరహా డిజైన్ కనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. పుష్ప2 రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.