తెలంగాణ(Telangana) లో రాష్ట్ర శాసనసభకు త్వరలో జరగనున్న ఎన్నికలకు బీజేపీ (BJP) సర్వం సిద్దమవుతుంది. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ముమ్మరం చేసింది. అధికార బీఆర్ఎస్ (BRS) ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసింది.ఈ క్రమంలో ప్రధాన పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు భారతీయ జనాత పార్టీ గురి పెట్టింది. పార్టీ టిక్కెట్లు కోసం ఆశావహుల నుంచి అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ముగిసింది.రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలకు మొత్తం 6003 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇందులో సీఎం కేసీఆర్ ఇదివరకే తాను ప్రకటించి పోటీచేసే గజ్వేల్ (Gajwal) కామారెడ్డి స్థానాల్లోకమలం పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి కీలకమైంది. ధీటుగా ఎదుర్కొని, విజయం దిశగా సాగే బలమైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల(MLA Etala) రాజేందర్ పై గురి పెట్టారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ ప్రధాన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ముదిరాజ్(Mudiraj)సమాజంలో బలమైన నేతగా పేరుంది. ఆయన సతీమణి ఈటల జమున… సీఎం కేసీఆర్ (CMKCR) పై పోటీకి సై అంటున్నట్లు తెలుస్తోంది. ఆమె గజ్వేల్ స్థానంలో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ అధిష్టానానికి దరఖాస్తు కూడా సమర్పించడంతో కేసీఆర్ పై పోటీకి తెరపైకి వచ్చారు. బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందా? నిరాకరిస్తుందా? గజ్వేల్ బరిలో నిలవనున్నారా? అన్నది ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది.
మరోవైపు హుజూరాబాద్ (Huzurabad) నుంచి ఈటల రాజేందర్ పార్టీ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దంపతులిద్దరూ బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటేందుకు ఉవిళ్లూరుతున్నారు. ఒకే పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీకి ముందుండి పనిచేసేవాళ్ళను పక్కన పెట్టి ఇలా ఒకే కుటుంబానికి సహకరించడం పై లోలోపల నాయకులలో విమర్శలతో పాటూ అసహనం మొదలవుతుంది. ఇచ్చినా ఇవ్వొచ్చు అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తెలంగాణ (Telangana) విషయానికొస్తే బీజేపీలో బలమైన నాయకులు కరువయ్యారు. పైగా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ కూడా మందకొడిగా సాగింది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు అవసరం అని భావిస్తే టికెట్ తప్పకుండా వచ్చే అవకాశం ఉంది.